Yuvraj Singh: రోహిత్, కోహ్లి గతంలో ఏం సాధించారో మర్చిపోయారు: యువరాజ్ సింగ్ 1 d ago
టీంఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశపర్చారు. అంతకుముందు స్వదేశంలో కివీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లలోను ఇదే తీరు. ఈ క్రమంలోనే రోహిత్, విరాట్ పై పలువురు మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జట్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరిద్దరికి మద్దతుగా నిలిచాడు.
ఓడినా, గెలిచినా రోహిత్ గొప్ప కెప్టెన్. రోహిత్ సారథ్యంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ వరకు వెళ్లాం. టీ20 ప్రపంచకప్ గెలిచాం. ఇంకా ఎన్నో సాధించాం. ఆటగాళ్లు రాణించనప్పుడు వారి గురించి చెడుగా చెప్పడం సులభం. కానీ వారికి మద్దతుగా నిలవడం చాలా కష్టం. వారి గురించి చెడుగా మాట్లాడటమే మీడియా పని. రోహిత్, విరాట్ నా ఫ్యామిలీ. నా కుటుంబం, సోదరులకు మద్దతుగా నిలవడం నా విధి' అని యువరాజ్ పేర్కొన్నాడు.